Advertisement
Google Ads BL

తాగి గొడవ చేసిన మెగా హీరో..??


గత అర్ధరాత్రి ఓ యువహీరో మద్యం మత్తులో గొడవ చేశాడంటూ పలు చానళ్లలో వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఆ యువహీరో ఎవరో కాదని.. రాంచరణ్‌తేజనేనంటూ ఓ చానల్‌ వార్తను ప్రసారం చేసింది. రాంచరణ్‌తోపాటు విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి కుమారుడు, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుమారుడు కూడా ఉన్నట్లు ఆ టీవీ చానల్‌లో వార్త కథనాలు ప్రచురితమయ్యాయి. మద్యం మత్తులో వీరంతా ఓ ఐపీఎస్‌ అధికారి ఇంటివద్ద గొడవ చేశారని సమాచారం. అయితే గతంలోనూ రాంచరన్‌ తేజ రోడ్డుపై తాజ్‌కృష్ణా హోటల్‌ వద్ద వాహనదారులతో గొడవపడటం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు ఓ చానల్‌ ప్రసారం చేసినట్లు రాంచరణ్‌ నిజంగానే ఆ గొడవ చేసి ఉంటే అది మెగా ఫ్యామిలీ ప్రతిష్టకు దెబ్బవంటిదనే చెప్పవచ్చు. ఇక ఈ వార్తపై మెగా ఫ్యామిలీ ఇంకా స్పందించలేదు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs