టీీవీ-9లో యాంకర్‌గా, న్యూస్ ప్రజెంటర్‌గా ఎంతో పేరుపొందిన బద్రి ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పెళ్లికి హాజరైన బద్రి తిరుగుప్రయాణంలో ద్వారకా తిరుమల వెలుతుండగా కారు టైర్ పంక్చర్ కావడంతో వాహనం వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య, ఇద్దరు కుమారులు, బావమరిది తీవ్రంగా గాయపడ్డారు. 2004 నుంచి టీవీ-9లో పనిచేస్తున్న బద్రి అంచెలంచెలుగా ఆ చానల్‌లో ప్రజెంటర్‌లలో ప్రముఖుడిగా ఎదిగారు. ప్రస్తుతం టీవీ-9లో రజినీకాంత్ తర్వాత స్థానం అతడిదే. బద్రి మృతిపై పలువురు జర్నలిస్టులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.