Advertisement
Google Ads BL

దుబాయ్ లో అత్యంత వైభవంగా జరిగిన గామా అవార్డ్స్..!


ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ కార్యక్రమం శుక్రవారం, ఫిబ్రవరి 6న దుబాయ్ లోని జబీల్ పార్క్ లో  అంగరంగ వైభవంగా జరిగింది. 2014లో విడుదలైన చిత్రాల నుంచి ప్రేక్షకుల ఎంపిక ద్వారా ఎన్నికైన సినీ సంగీత దర్శకులు, పాటల రచయితలు, గాయనీ గాయకులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ కార్యక్రమంలో తెలుగు సినీరంగ ప్రముఖులు రెబల్ స్టార్ కృష్ణంరాజు దంపతులు, సంగీత దర్శకులు కోటి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పద్మశ్రీ బ్రహ్మానందం, దేవిశ్రీప్రసాద్, అల్లరి నరేష్ , శర్వానంద్, ఎం.ఎం.శ్రీలేఖ, రఘుకుంచె వంటి ప్రముఖులతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇతర గల్ఫ్ దేశాలలోని తెలుగు వారు దాదాపు 4 వేలమందికి పైగా తెలుగు ప్రేక్షకుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, కళలు ప్రతిబింబించే ఎన్నో అధ్బుతమైన చిత్రాలు అందించిన దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా కళాతపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ "నన్ను ఇంతదూరం తీసుకు వచ్చి ఇంత మంది ఆదరణ, ప్రేమ, ఆప్యాయతలతో అందిస్తున్న ఈ సత్కారం వల్ల మీ అందరి మంచి మనసుల ఆశీస్సులతో నా ఆయుష్షు ఇంకా పెరుగుతుంది. నేను మరింత కాలం మంచి పాత్రలతో మీ ముందుకు వచ్చే అవకాసం కల్పిస్తుంది. నేను గొప్పవాడ్ని కాదు. నాకు అధ్బుత శక్తులేమి లేవు. చదువు అంతంత మాత్రమే. గొప్ప తెలివైనవాడ్ని కాదు. కానీ నా పని నేను చేసుకోవడం, నమ్మినదానికి కట్టుబడటం నా విజయ రహస్యం. తపస్సు అంటే అడవుల్లో దేవుడి కోసం చేసేదే కాదు, మనం చేసే పనిని ఇష్టపడి, ప్రేమించి సంపూర్ణం చేసినవాడే తపస్వి. ఈనాడు 'గామా' నన్ను దుబాయ్ తీసుకు వచ్చి చేస్తున్న ఈ సత్కారాన్ని వినయంగా స్వీకరిస్తున్నాను'' అన్నారు. 

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ "కె.విశ్వనాథ్ వంటి ధన్యజీవిని సత్కరించడం తెలుగు వారు మరియు భారతీయులైన మనందరికీ జీవన సాఫల్య పురస్కారం వంటిది" అన్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరియు పద్మశ్రీ బ్రహ్మానందం చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది.

గామా అవార్డ్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పద్మభూషణ్ గాన కోకిల చిత్ర, 'ఆరడుగుల బులెట్' విజయ్ ప్రకాష్, ఇండియన్ ఐడెల్ శ్రీరామచంద్ర, గీతామాధురి, వందేమాతరం శ్రీనివాస్, మాలతిలతో సినీ సంగీత విభావరి నిర్వహించగా, సురేష్ వర్మ బృందం టాలీవుడ్ హీరోయిన్లు సలోని, సదా, యాంకర్ అనసూయలతో కలిసి చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. శివారెడ్డి బృందం నిర్వహించిన హాస్య అల్లరి కడుపుబ్బ నవ్వించింది. 

ఈ సందర్బంగా తెలుగు రచయితలెందరో శీర్షికలందించిన గామా అవార్డ్స్ ప్రత్యేక సంచిక 'తెలుగు వైభవం' మరియు ఎం.ఎం.శ్రీలేఖ స్వరపరచిన గామా థీంసాంగ్ ను ఆవిష్కరించారు. 

గల్ఫ్ దేశాలలో తెలుగు వారి సాంస్కృతిక చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని, తెలుగు వారందరి సహకారంతో ఇటువంటి అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తుంటామని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని గామా చైర్మన్ త్రిమూర్తులు తెలిపారు. 

అనిల్ కడియాల నిర్వహణలో 'గామా అవార్డ్స్' కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది.

బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : దేవిశ్రీప్రసాద్ (లెజెండ్)

బెస్ట్ లిరిసిస్ట్               : చంద్రబోస్ (మనం)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్   : అనూప్ రూబెన్స్

బెస్ట్ సెలబ్రిటీ సింగర్     : రవితేజ (నోటంకి - పవర్)

బెస్ట్ ఫిమేల్ సింగర్      : నేహా భాసిన్ (1 నేనొక్కడినే)

బెస్ట్ మేల్ సింగర్         : సింహా (సినిమా చూపిస్త మామా)

బెస్ట్ లవ్ సాంగ్           : అనూప్ రూబెన్స్ (మనం)

బెస్ట్ డ్యూయెట్ సాంగ్   : తమన్ (భేల్ పూరి- ఆగడు)

బెస్ట్ అప్ కమింగ్ సింగర్ : అనుదీప్ 

బెస్ట్ ఐటెం సాంగ్           : దేవిశ్రీప్రసాద్ (అయ్యోపాపం - ఎవడు)

బెస్ట్ టైటిల్ సాంగ్           : దేవిశ్రీప్రసాద్ (లెజెండ్)

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs