తెలంగాణా రాష్ట్రం లో చలన చిత్ర పరిశ్రమ సమగ్ర ప్రగతికి ఔత్సాహిక నిర్మాతలకు నిర్మాణ సంస్థలకు దిశా నిర్దేశం చేయడానికి 5 సం,, ల క్రితం తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆవిర్భవించింది. తెలాంగాణ రాష్ట్రం లోని టెలివిషన్ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, నిర్మాణ సమస్థలు కలసి కట్టుగా ప్రణాళికా బద్దంగా పరిశ్రమ ఎదుగుదలకై సంఘటితంగా ఎదగడానికి తెలంగాణా టెలివిజన్ డెవలప్మెంట్ పోరం ఆవీర్భావించింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా మొదటి సారి తెలంగాణా రాష్ట్రం లో 'కోహినూర్ అవార్డు' పేరిట తెలంగాణా చలన చిత్ర, టెలివిజన్ రంగాలకు సేవలందించిన వారికీ ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ను ఫిబ్రవరి 5న ఫిలిం నగర్ లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ప్రదానోత్స్తావం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖామాత్యులు ఏ ఇంద్రకరణ్ రెడ్డి, సభాద్యక్షులుగా సి .పార్ధసారధి పాల్గొన్నారు.
భవిష్యత్తులో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వాహిస్తాము ఇది చిన్న ఆరంభం ఈ అవార్డు స్వీకరించడానికి అంగీకరించిన వారిని అభినందిస్తూ ఈ రోజు జీవ సాఫల్య పురస్కారంగా 'హాస్య నట విరాట్' బిరుదును స్వీకరిస్తున్న ప్రముఖ సినీ నటులు బాబుమోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచెస్తున్నాం. సుమారు 900 చలన చిత్రాల్లో తన అద్భుత హాస్యాన్ని అందించిన ఈ జీవన సాఫల్య పురస్కారం చిరు కానుకను అందిస్తున్నామని తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ పోరం అధ్యక్షులు నాగ బాల సురేష్ కుమార్ తేలియచేసారు.
తెలంగాణా ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి.అమ్రిష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆవిర్భావానికి మేము ఎన్నో వొడి దుడుకులను ఎదుర్కొన్నాము. చివరకు సాధించాము. మన రాష్ట్ర కళాకారులకు కొదవ లేనే లేదు. ఈ నాటి యువత ఎలాంటి నట శిక్షణా సంస్థల్లో చేరడానికి ఆర్ధికంగా వెనకపడటంతో ముందుకు రాలేక పోతున్నారు. అలాంటి వారికీ ప్రభుత్వం చేయూత నిస్తే మంచి మంచి కళాకారులు చిత్ర పరిశ్రమలో నటులు గా ఎదుగుతారు. అన్నారు.
ఈ సందర్భంగా ముందుగా అవార్డు గ్రహీత బాబుమోహన్ మాట్లాడుతూ తెలంగాణా వచ్చిన తరువాత ఇచ్చిన మొదటి అవార్డు ఇది నాకు చాలా సంతోషం గా ఉంది. సురేష్ గారికి కళాకారులను సత్కరించడం అన్నా వారికి ఆర్ధిక సహాయ సహకారాలు అందించడం అన్నా చాలా మక్కువ. సురేష్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చూసే అతనంటే నాకు ఇష్టం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసినా నేను ఎంత బిజీ గా ఉన్నా వెళ్లి తీరుతాను. నాకు ఇంతటి అవార్డు ను మరియు 'హాస్య నట విరాట్' బిరుదు ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, ఇంకా సినిమాలలో నటించాలని ఉంది మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తాను నా ఊపిరి ఉన్నంత వరకు నటిస్తానన్నారు బాబూమోహన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా విచ్చేసిన
తెలంగాణా రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి A. ఇంద్ర కరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా లోని కళాకారులకు ప్రతిభావంతులైన వారికి ఇలాంటి కోహినూర్ అవార్డ్స్ ఇవ్వటం అనేది అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన నూతన ఉత్సాహాన్ని అందించిన వారలవుతారు. సినీ పరిశ్రమ బాగు కోసం మన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారు ఎంతో తర్జన భర్జన పడుతున్న విషయం మందరికి తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాలకు మావంతు సహాయ సహకారాలు అందించడానికి మేము ఎప్పుడూ సింద్దంగానే ఉంటాము. ఇక బాబు మోహన్ గారి విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి ఆయన నటించిన సినిమా లన్నీ చూసేవాడిని ఇలాంటి వ్యక్తికి ఇంతటి అవార్డు రావడం అనేది చాలా సంతోషం కలిగించే విషయం అన్నారు. స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి గారి శ్రీమతి శ్రావణి మాట్లాడుతూ ఈ అవార్డు ప్రధాన కార్యక్రమం లో ఆయన లేకపోవడం చాల భాదాకరమైన విషయం అంటూ ఉద్వేగానికి లొనయ్యారు. టి వి నటి మల్లిక మాట్లాడుతూ ఒక అమ్మాయి పెళ్లి అయ్యిన తరువాత మొదటి సారిగా అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు సారె స్వీకరించిన విధంగా అంతటి ఆనందంగా ఉందినాకు ఈ అవార్డు ఇచ్చిన అన్నయ్యలకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానన్నారు
సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ 2014 సం,, వెళుతూ వెళ్ళుతూ నాకు ఎన్నో అవార్డ్స్ ను ఇచ్చింది ఇప్పడు 2015 సం,, వస్తూ వస్తూ నే కోహినూర్ డైమెండ్ అవార్డు ను తెచ్చి పెట్టింది. 2 వేల పాటల్ని వ్రాసాను దానికి కూడా సంతోషం గానే ఉంది ఇంతటి మహత్తరమైన అవార్డు ను తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది సురేష్ గారికి నా కృతజ్ఞతలు అన్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ తెలంగాణా లో ఉన్న పెద్దవారికి 'పద్మశ్రీ' అవార్డ్స్ కు ఎన్నిక చేయాలని, అంతే కాకుండా తెలంగాణా సినిమా అవార్డ్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నానన్నారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న, అవార్డ్స్ గ్రహీతలు మిమిక్రి ఆర్టిస్ట్ శివా రెడ్డి , డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్.సి.ఎం. రాజు, నిర్మాత అల్లాని శ్రీదర్, మొట్టమొదటి మేకప్ వుమెన్ శోభలత పాత్రికేయులు కె అర్ నారాయణ రాజు లు కూడా తమ తమ ఆనందాన్ని వ్యక్తపరచి సురేష్ గారికి కృతజ్ఞతలను తేలియచేసారు.
ఇదే సమయం లో నాగ బాల సురేష్ 2014 కాకతీయ అవార్డ్స్ ను ఇవ్వాలని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. అలానే ఉగాది పర్వదినాన ప్రతిభా వంతులైన ప్రింట్ మీడియా వారికి ఫోటోగ్రాఫర్స్ కు కూడా ఉగాది అవార్డ్స్ ఇవ్వాలని నిర్ణయించుకునట్టు తెలిపారు.
Advertisement
CJ Advs