కెరీర్ మొదలుపెట్టి ఎనిమిదేళ్ళు అయినా హన్సిక వయసు ఇప్పుడు కేవలం 23 ఏళ్ళే. చిన్నతనంలోనే హీరోయిన్ గా పరిచయం కావడంతో ఆమెకు ఇంత లాంగ్ కెరీర్ వచ్చింది. తెలుగులో యంగ్ స్టార్స్ తో నటించినప్పటికీ ఆమెకు సీనియర్ల సరసన మాత్రం అవకాశాలు రాలేదు. అవకాశాలు రాలేదు అనే దానికన్నా తన కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న వారితో ఆమె కలిసి నటించలేదు. తెలుగులో ఆమె సీనియర్ స్టార్స్ తో ఇప్పటివరకు చేయలేదు. ఇక సీనియర్ హీరో బాలకృష్ణకు ఇప్పుడు హీరోయిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 'లయన్' చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి అయినాక ఇక తప్పని పరిస్థితుల్లో త్రిష, రాధికాఆప్టేలను తీసుకున్నారు. దీంతో త్వరలో ప్రారంభం కానున్న బాలయ్య 99 వ చిత్రంలో హీరోయిన్ల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్నాడు దసకుడు శ్రీవాస్. సినిమా సెట్స్ పైకి వెళ్ళే లోపే హీరోయిన్లను ఎంపిక చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నయనతారను ఒప్పించాడు. ఇక తాను దర్శకత్వం వహించిన 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా హన్సికతో చేసిన సాన్నిహిత్యంతో ఆయన బాలయ్య సినిమాలో హన్సికను తీసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు.