'టెంపర్' చిత్రం విడుదల దగ్గర పడుతోన్న కొద్ది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. మామూలు హిట్ కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని వారు ఆశిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు దయ. కానీ అతనిలో లేనిది దయే. కానీ నందమూరి అభిమానులు మాత్రం దేవుడి దయ కోసం కనిపించిన దేవుడికల్లా ప్రార్ధనలు చేస్తూ, మొక్కులు మొక్కుతున్నారు. గత కొంతకాలంలో సరైన హిట్ లేని తమ హీరోకు 'టెంపర్' బ్లాక్ బస్టర్ గా నిలవాలనే కోరికను వెలిబుచ్చుతున్నారు. ఇక గతంలో బండ్ల గణేష్ నిర్మాతగా రూపొందిన 'గబ్బర్ సింగ్' విడుదలకు ముందు కూడా దేవుడికి మొక్కుకొని పాదయాత్ర చేసిన బండ్లగణేష్ సోదరుడు మరలా 'టెంపర్' చిత్రం కోసం పాదయాత్ర చేస్తుండటం విశేషం. మరి 'దయ' పట్ల దేవుడు ఎలాంటి 'దయ' చూపిస్తాడో వేచిచూడాల్సివుంది.