Advertisement
Google Ads BL

దిల్లీలో గల్లీ రాజకీయాలు గలీజు ఆరోపణలు..!


దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : జాతీయ, అంతర్జాతీయ నాయకులు, దౌత్యవేత్తలు, వ్యాపారస్తుల కళ్ళముందు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికల నమూనా ఆవిష్కృతమవుతోంది. ఈ ఎన్నికలకు ముందు ` రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా అమెరికా అధ్యక్షుణ్ణి తీసుకొచ్చిన ఘనత మోదీది. తన ప్రమాణ స్వీకారోత్సవం నాటినుండి ఇరుగుపొరుగు దేశాధినేతలతో మోదీ నెరపుతున్న దౌత్యం భారతీయుల దృష్టినేకాదు, ప్రపంచ దేశాధినేతల దృష్టినికూడా ఆకట్టుకుంది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో మోదీ సభలకు జనం బారులుతీరారు. దేశ రాజధానిలో పాగా వేయడమంటే దేశంలోపాగా వేయడమే! జమ్మూ కాశ్మీర్‌ సహా అన్ని చోట్లా అభివృద్ధి మంత్రాన్ని జపించిన మోదీ సేన దిల్లీలో గల్లీ రాజకీయాలకు దిగి కేజ్రీవాల్‌ని పెద్దవాడ్ని చేసింది. ‘అభివృద్ధి ` శాంతి ` బలమైన ప్రభుత్వం’ అంశాలు వెనక్కిపోయి గలీజు ఆరోపణలు వినిపించడం సిగ్గుచేటు. అన్నిచోట్లా ఎంతో హుందాగా ప్రచారంచేసిన బిజెపి దిల్లీలో ‘ఆమ్‌ ఆద్మీ’ని టార్గెట్‌ చేయడం వెనుక ఓ వ్యూహం కనిపిస్తోంది కేజ్రీవాల్‌. దిల్లీ ఎన్నికల బరినుంచి కాంగ్రెసుని తుడిచేసింది. కాంగ్రెసు ‘జీరో’ అయిన మాట నిజమే గాని కేజ్రీవాల్‌ ‘హీరో’ అయ్యారు! ఎన్నికలకు ముందే కేజ్రీవాల్‌ విజయం సాధించారు ` మోదీకి ముచ్చెమటలు పట్టించడంలో! పార్లమెంటులో అన్నీ తానే అయి నడిపిస్తున్న వెంకయ్య నాయుడికి కొరకురాని కొయ్యగా మారారనడం సత్యం!

Advertisement
CJ Advs

-తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs