మెగాస్టార్ చిరంజీవికి, హీరో రాజశేఖర్ కు మధ్యమ వచ్చిన కలతలు తొలగిపోతున్న సంగతి తెలిసిందే. రకరకాల కారణాలు, పరిస్థితుల వల్ల గతంలో మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. అయితే నాగబాబు చొరవతో అవి మరిచి మళ్ళీ ఇద్దరు దగ్గరవుతున్నారు. ఈ విషయాన్ని రాజశేఖర్ సొంతంగా తెలియజేసిన సంగతి తెలిసిందే. త్వరలో తాను మెగాస్టార్ చిరంజీవిని తన ఇంట్లో జరిగే ఓ ఫంక్షన్ కు స్వయంగా ఇన్వైట్ చేస్తానని చెప్పిన రాజశేఖర్ ఆ పని చేస్తున్నాడు. తన సొంత చిత్రమైన 'గడ్డం గ్యాంగ్' చిత్రాన్ని చిరు కోసం స్పెషల్ షో వేయిస్తానన్నాడు. ఈ చిత్రం ఈ నెల 6 వ తేదీన విడుదల కానుంది. మరి రాజశేఖర్ ఆహ్వానానికి చిరు ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సివుంది.