నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్యదేవాతో చేస్తోన్న 'లయన్' చిత్రం బిజీలో ఉన్నాడు. అయినా కూడా ఆయన తన 99 వ చిత్రానికి సంబంధించిన డిస్కషన్స్ లో పాల్గొంటున్నాడు. కోనవెంకట్, గోపీమోహన్ లు రచన చేస్తున్న ఈ చిత్రానికి 'లక్ష్యం' , 'లౌక్యం' దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీని సైతం బాలయ్య పదిరోజుల కిందటే ఓకే చేసినట్లు సమాచారం. 'లౌక్యం' చిత్రాన్ని కుటుంబసమేతంగా చూసిన బాలయ్య శ్రీవాస్ ప్రతిభ నచ్చి ఓ వినోదాత్మక చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే తన నుండి ప్రేక్షకులు ఆశించే మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండాలని బాలయ్య సూచించడంతో స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసిన రచయితలు, దర్శకుడు లేటెస్ట్ వెర్షన్ ను కూడా వినిపించడం జరిగిందని, స్టొరీ అద్భుతంగా ఉందంటూ బాలయ్య మెచ్చుకున్నాడట. కాగా 'లెజెండ్, లయన్' వంటి పవర్ ఫుల్ ఇంగ్లీష్ టైటిల్స్ తో వస్తున్న బాలయ్య ఈ చిత్రానికి కూడా 'డిక్టేటర్' అనే టైటిల్ ను సూచించాడని, ఇదే టైటిల్ ను కన్ఫర్మ్ చేసే యోచనలో యూనిట్ ఉన్నట్లు సమాచారం