మాస్ మహారాజా రవితేజకు స్నేహితులు ఎక్కువ. భాషా బేదం లేకుండా ఆయన అందరి హీరోలతో సన్నిహితంగా ఉంటుంటారు. అదే స్నేహంతో ఆయన ఓ కన్నడ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. ఆ చిత్రం మరేదో కాదు... కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న 'వజ్రకాయ'. ఈ చిత్రంలో మన మాస్ హీరో తళుక్కున మెరుస్తాడు. కొరియోగ్రాఫర్ నుండి దర్శకునిగా మారిన హర్ష దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ధనుష్ ఓ పాట పాడడం విశేషం. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగులో ఇతర భాషలకు చెందినా పలువురు స్టార్ హీరోలు గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తుండటం విశేషం. రవితేజతో పాటు తమిళ నటుడు శివకార్తికేయ, మళయాళ నటుడు దిలీప్, కన్నడ క్రేజ్ హీరో రవిచంద్రన్ శివరాజ్ కుమార్ తో కలిసి స్టెప్పులు వేసారు.