పై ఫొటోలో ముద్దులొలికిస్తూ కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈ లిటిల్ ప్రిన్స్ ఎవరో కాదు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రేణూదేశాయ్‌ల గారాలపట్టి ఆద్య. ఆదివారం పూనేలో జరిగిన స్కూల్ వేడుకలో సంప్రదాయ దుస్తులు ధరించి ఆద్య చేసిన క్లాసికల్ డ్యాన్స్ ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేసిందట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది రేణూదేశాయ్. ఈ వేడుకకు పనవ్‌కల్యాణ్‌ను ప్రత్యేకంగా విచ్చేసి కూతురు ప్రదర్శనను తిలకించాడట. తన ముద్దుల కూతురు నృత్య ప్రదర్శన చేయడం మరపురాని మధురానుభూనిచ్చిందని, తనకంటే తండ్రిగా పవన్‌కల్యాణ్ మరింతగా సంతోషపడ్డారని తెలిపింది రేణూదేశాయ్. పవన్‌కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత కుమారుడు అకిరా నందన్, కూతురు ఆద్యతో కలిసి రేణూదేశాయ్ గత కొన్నేళ్లుగా బెంగళూరులో విడిగా వుంటున్న సంగతి తెలిసిందే. కాగా నృత్య ప్రదర్శన వేడుకకు పవన్, రేణుదేశాయ్ కలిసి హాజరవ్వడం కొసమెరుపు.