తెలుగు సినీ రచయిత బి.వి.ఎస్.రవి అలియాస్ మచ్చ రవి గతంలో రెండు సార్లు మద్యం తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఒక సమయంలో ఆయన వెంట హీరో రవితేజ ఉండగా, మరోసారి ఆయన వెంట రాంగోపాల్ వర్మ ఉన్నాడు. దీంతో పోలీసులు రవికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల మరలా ఆయన తాగి డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరకడంతో ఆయన డ్రైవింగ్ లైసెన్స్ ను రవాణా శాఖ రద్దు చేసింది. రవితో పాటు మరికొందరు ప్రముఖుల డ్రైవింగ్ లైసెన్స్ లను కూడా రద్దు చేస్తూ రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.