ఊహించనిరీతిలో కళ్యాణ్ రామ్ 'పటాస్' చిత్రం అధ్బుతమైన విజయాన్ని నమోదు చేసుకుంటోంది. మొదటి వారంలోనే వరల్డ్ వైడ్ గా 13 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో ఎంతో ఆనందంగా ఉన్న కళ్యాణ్ రామ్ విజయయాత్ర చేస్తున్నాడు. కాగా కళ్యాణ్ రామ్ విజయయాత్ర చేస్తున్నాడు. కాగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా ప్రస్తుతం రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో 'కిక్2' చిత్రం నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఆయన తన తమ్ముడు ఎన్టీఆర్ తో ఓ సినిమా, బాబాయ్ బాలకృష్ణ హీరోగా మరో సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాదు.. మంచిస్టొరీలు లభిస్తే జూనియర్ ఎన్టీఆర్ తో బాబాయ్ బాలకృష్ణ కలిసి నటిస్తానని అంటున్నాడు. అలాగే.. మంచి కథ దొరికితే అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం'లాగా నందమూరి హీరోలందరూ కలిసి నటించే అవకాసం ఉందని, అలాంటి అవకాశం వస్తే ఆ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మాతగా నిర్మిస్తానని కళ్యాణ్ రామ్ అంటున్నాడు.