వయసులో జరగాల్సిన ముచ్చట ఆ రోజుల్లో జరగాలంటారు పెద్దలు. అందుకు తగ్గట్లే సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్ళికి రెడీ అయిపోయింది. అయితే త్రిషకు అటుఇటుగా వయసు కలిగిన సీనియర్ హీరోయిన్‌లు చాలా మందే ఉన్నారు టాలీవుడ్, కోలీవుడ్‌లలో. వారికి వివాహం చేసుకుని ఓ దారి చూపిస్తోంది త్రిష. 30 ప్లస్ హీరోయిన్ల విషయానికి వస్తే త్రిషతో పాటు శ్రియ, అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు ఇదే లిస్ట్‌లో ఉంటారు. అయితే ఇప్పటికీ శ్రియ, అనుష్కలు పెళ్ళి విషయమై పెదవి విప్పడం లేదు. పెద్దగా అవకాశాలు లేనప్పటికీ ఇంకా వెండితెరపై తళుక్కున మెరవాలనే కోరిక వారిలో తగ్గడం లేదు. అయితే శ్రియతో పాటు అనుష్క కూడా కొత్తగా సినిమాలు ఒప్పుకోవడం లేదని, వారు కూడా పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యే ఉద్ధేశ్యంతో ఉన్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. ఇక ప్రేమలో రెండు సార్లు ఘోరంగా ఫెయిలైన నయనతార మాత్రం పెళ్ళి ఊసు ఎత్తడం లేదు. తన లవ్ ఫెయిల్యూర్స్‌ను మర్చిపోయేందుకు వర్క్‌లో బిజీ అవుతూ, వరుసగా చిత్రాలను ఒప్పుకుంటుంది. మరి వైరాగ్యంలో ఉన్న ఆమె కూడా పెళ్ళికి సిద్ధమైతే చూడాలని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు.