బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 'పద్మ' అవార్డులు దాదాపు ఆయన కుటుంబ సభ్యులందరికీ దక్కాయి. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కు పద్మశ్రీ, పద్మ భూషణ్ లు లభించాయి. ఇక అమితాబ్ సతీమణి జయాబచ్చన్ కు పద్మశ్రీ వచ్చింది. కోడలు ఐశ్వర్యారాయ్ కు పద్మశ్రీ లభించింది. అమితాబ్ కు పద్మ విభూషణ్ వచ్చింది. ఈ విధంగా చూసుకుంటే ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు తప్ప మిగిలిన కుటుంబసభ్యులందరికీ పద్మ అవార్డులు రావడం గర్వకారణమే అంటున్నారు బిగ్ బి అభిమానులు.