మహేష్ తో సన్నీలియోన్...?


ఇంటర్నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ సన్నీలియోన్.. జనవరి 1 న హైదరాబాద్ లో తను  చేసిన హంగామా ప్రేక్షకులు మరువక ముందే ఇంకో హాట్ న్యూస్ తో అందరి లుక్స్ ను తన వైపు తిప్పుకుంది. కొరటాల శివ దర్శకత్వం లో మహేష్ బాబు, శ్రుతిహాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం షూటింగ్ కోసం పొల్లాచి వెళ్లనున్నారు. అక్కడ షూటింగ్ ముగించిన తరువాత మహేష్ బాబు, సన్నీ లియోన్ తో ఒక స్పెషల్ సాంగ్ చేయనున్నారట. రీసెంట్ గా తెలుగులో సన్నీ స్పెషల్ సాంగ్ లో వచ్చిన సినిమా 'కరెంటు తీగ'. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవలేదనే చెప్పాలి. రెండు వరుస ఫ్లాప్ లతో హిట్ కోసం చూస్తున్న మహేష్  సినిమాకి సన్నీ ఎంత వరకు హెల్ప్ అవుతుందో వేచి చూడాలి. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES