'లింగ' చిత్రమ్ బాక్సా ఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ ధరలకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, కొనుగోలు దారులు తమ నష్టాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆఖరిగా ఆమరణ నిరాహరదీక్షలకు కూడా సిద్దమయ్యారు. అయితే నిర్మాత రాకలైన్ వెంకటేష్ మాత్రం తమకు ఏమీ లాభాలు రాలేదని, దాంతో నష్టం పూడ్చటం తన వల్ల కాదని తేల్చిచెప్పాడు. ఇన్నాళ్ళు ఇదంతా గమనిస్తూ వస్తున్న రజనీకాంత్ ఎట్టకేలకు తనే రంగంలోకి దిగాడు. గతంలో 'బాబా, కుచేలన్' చిత్రాలతో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న రజనీ ఈసారి కూడా తానే ముందుకు వచ్చాడు. ఏయో డిస్ట్రిబ్యూటర్లు ఎంత నష్టపోయారు? ఎవరికి ఎంత ఇవ్వాలి? అనే విషయాలు తెలుసుకునేందుకు గాను తనకు బాగా దగ్గరి వ్యక్తుల ద్వారా నివేదికలు తెప్పించుకునే పనిలో ఉన్నాడట. మొత్తానికి రాకలైన్ వెంకటేష్ అత్యాశ వల్ల విషయం రజనీ చేతికి వచ్చిందని, ఆ మొత్తానికి రజనీ సొంత డబ్బులు నుండి గాక, నిర్మాత నుండే వసులు చేసి ఇవ్వాలని రజనీ అభిమానులు కోరుతున్నారు.