Advertisement
Google Ads BL

ఫిల్మ్‌ జర్నలిస్టులకు స్వైన్‌ఫ్లూ మందుల పంపిణీ


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో స్వైన్‌ఫ్లూ ఎలా వీర విహారం చేస్తోందో అందరికీ తెలిసిందే. స్వైన్‌ఫ్లూ చికిత్సకు, నివారణకు, దీనిపై ప్రజల్లో ఒక అవగాహన తెచ్చేందుకు ప్రభుత్వం, మీడియా చేస్తున్న కృషి కూడా అందరికీ తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఫిల్మ్‌ జర్నలిస్టులు స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా వారకి మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో ప్రారంభించింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌రెడ్డి, ఠాగూర్‌ మధు, ప్రముఖ నిర్మాత, ఎడిటర్‌ బి.ఎ.రాజు, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి కొడాలి వెంకటేశ్వరరావు, డాక్టర్‌ శ్రీరామ్‌

Advertisement
CJ Advs

ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవగా తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు నారాయణరాజు, అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వైస్‌ ప్రెసిడెంట్‌ వారణాసి లక్ష్మినారాయణ, జనరల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌తోపాటు మిగతా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. దిల్‌రాజు, మధుర శ్రీధర్‌రెడ్డి చేతులమీదుగా స్వైన్‌ఫ్లూ నివారణకు మాస్క్‌లు, మందుల పంపిణీ జరిగింది. 

ఈ సందర్భంగా నారాయణరాజు మాట్లాడుతూ ‘‘తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జర్నలిస్టులు తమ ఉద్యోగాల రీత్యా ఎన్నో చోట్లకు తిరగాల్సి వుంటుంది. కాబట్టి వారు స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా మాస్క్‌లు, మందుల పంపిణీ చేయడం జరుగుతోంది’’ అన్నారు.  

డాక్టర్‌ శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘ఈ వ్యాధి అందరూ అనుకుంటున్నట్టు అంత పెద్దది కాదు. చాలా చిన్నది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని, ఎన్‌75 మాస్క్‌లు ధరించడం ద్వారా, మెడిసన్స్‌ తీసుకోవడం ద్వారా  ఈ వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ వ్యాధి సోకిరా డాక్టర్లు అందుబాటులో వున్నారు కాబట్టి చికిత్స కూడా సులభమే’’ అన్నారు. 

బి.ఎ.రాజు మాట్లాడుతూ ‘‘ఈ వ్యాధి గురించి మీడియా ప్రజల్లో అవేర్‌నెస్‌ తెస్తోంది. జర్నలిస్టుల కోసం తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఈ మందుల పంపిణీ చేపట్టినందుకు వారిని అభినందిస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చెయ్యాలని కోరుతున్నాను’’ అన్నారు.

కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నామని, దానికి కౌన్సిల్‌ హాల్‌ కావాలని తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ అడగ్గానే ఫ్రీగా ఈ హాలును ప్రొవైడ్‌ చేశాం. ఇలాంటి మంచి కార్యక్రమాలకు మా సహకారం ఎప్పుడూ వుంటుంది’’ అన్నారు.

మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సమాజంలో బ్రతుకుతున్న మనం సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి. అలా అనుకోవడమే గొప్ప విషయం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న అసోసియేషన్‌ని అభినందిస్తున్నాను’’ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘వ్యాధి తీవ్రత ఎంత వున్నా మీడియా దాన్ని హైప్‌ చెయ్యడంవల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. కాబట్టి జనంలో ఆ భయాన్ని కలిగించవద్దని మీడియాను కోరుతున్నాను. ఫిల్మ్‌ జర్నలిస్టులు అందరికీ మందుల పంపిణీ చేపట్టిన తెలంగాణ ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ను అభినందిస్తున్నాను. అందరూ ఇలాగే ఎప్పుడూ కలిసి మెలిసి  వుండాలని కోరుతున్నాను’’ అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs