గతేడాది 'ఎవడు', 'గోవిందుడు అందరివాడేలే' వంటి రెండు చిత్రాలతో వచ్చిన రామ్ చరణ్ 'గోవిందుడు' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆయన నటించాల్సిన శ్రీనువైట్ల చిత్రం ఇంకా ప్రారంభంకాలేదు. దాంతో ఈ ఏడాది ఒకే సినిమాతో సరిపెట్టుకుంటాడని అందరు భావించారు. అయితే రామ్ చరణ్ మాత్రం ఈ ఏడాది కూడా రెండు చిత్రాలతో అభిమానుల ముందుకు వస్తానని మాట ఇస్తున్నాడు. అంటే ఈ ఏడాది ఆయన శ్రీనువైట్ల చిత్రం తోనే కాక కోనవెంకట్, గోపీమోహన్ లు రచన చేస్తున్న సురేంద్ర రెడ్డి సినిమాని కూడా ఇదే ఏడాది పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాననే ధీమాతో రామ్ చరణ్ ఉండటంతో ఆయన అభిమానులు ఆనందంగా ఉన్నారు.