మెగాస్టార్ చిరంజీవి తో విభేదించడం వల్ల చిరు ఎంత నష్టపోయాడో తెలియదు కానీ హీరో రాజశేఖర్ మాత్రం కెరీర్ పరంగా బాగా నష్టపోయాడు. దీంతో ఆలస్యంగా ఇప్పటికి రాజశేఖర్ తప్పు తెలుసుకున్నాడని మెగాభిమానులు అంటున్నారు. మెగాబ్రదర్ నాగబాబు వల్ల తమ రెండు కుటుంబాల మధ్య విభేదాలు సమసిపోయాయని, త్వరలో తన ఇంట్లో జరిగే ఓ వేడుకకు చిరును ఆహ్వానిస్తున్నట్లు రాజశేఖర్ తెలిపాడు. చిరు అడిగితే ఆయన 150వ చిత్రంలో విలన్ గా నటించడానికి సిద్దమని మరోసారి ప్రకటించిన ఆయన తన కెరీర్ రాబోయే 'గడ్డంగ్యాంగ్'పై ఆధారపడి వుందంటున్నాడు. మరి ఆయనకు 'గడ్డంగ్యాంగ్' ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది.