Advertisement
Google Ads BL

ఆ ఎమ్మెల్యే వలసను లోకేష్‌బాబు అడ్డుకోగలుగుతారా..??


కేసీఆర్‌ 'ఆకర్ష్‌' పథకానికి టీడీపీ పార్టీ కాకవికలమవుతోంది. తెలంగాణలో పార్టీకి భవిష్యత్తు లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి చూస్తున్నారన్న వార్తలు చంద్రబాబును కలవరానికి గురిచేస్తున్నాయి. టీడీపీ నుంచి ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని స్వయంగా కేసీఆర్‌ ప్రకటించడం తెలుగు తమ్ముళ్లను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే తరుణంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆయన టీఆర్‌ఎస్‌లో చేరకుండా అడ్డుకోవడానికి స్వయంగా చంద్రబాబు తనయుడు లోకేష్‌బాబు రంగంలోకి దిగారు. సోమవారం కృష్ణారావుతో భేటీ అయిన లోకేష్‌బాబు ఆయన్ను పార్టీ వీడవద్దని కోరినట్లు సమాచారం. అయితే ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చిన కృష్ణారావు భేటీలో లోకేష్‌బాబుకు ఎలాంటి హామీ ఇవ్వన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను తన భుజాలపైకి తీసుకున్న లోకేష్‌బాబు ఎంతవరకు విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే..!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs