Advertisement
Google Ads BL

తిరుపతి ఉప ఎన్నికలు ఏకగ్రీవం కాదు..!!


తిరుపతి శాసనసభ్యుడు మృతిచెందడంతో అక్కడ త్వరలో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే సంప్రదాయాలను అనుసరించి ఈ ఎన్నికల్లో తాము బరిలోకి దిగడం లేదని ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. అయితే తాము మాత్రం బరిలోకి దిగుతామని, ఎన్నికలను ఏకపక్షం కానివ్వమని ఇదివరకే లోక్‌సత్తా ప్రకటించింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా ఇక్కడ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తిరుపతి నుంచి శ్రీదేవిని కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించాడు. దీంతో ఎన్నికల సమరానికి టీడీపీ కూడా సిద్ధమవుతోంది. మొదట ఇక్కడ తమకు విజయం నల్లేరుపై నడకేనని టీడీపీ భావించినప్పటికీ.. ఇప్పుడు కాంగ్రెస్‌ పోటీలోకి రావడంతో విజయం కోసం టీడీపీ కూడా కాస్త శ్రమపడక తప్పని పరిస్థితి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs