Advertisement
Google Ads BL

జగన్‌ స్టూడియోస్‌ టి.వి. అండ్‌ ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభం


అతి తక్కువ వ్యయంతో సినిమా, టీవీ సీరియల్స్‌ షూటింగ్‌లు జరుపుకోవడానికి అనువైన సెట్లతో చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉంటూ పదేళ్లుగా స్టూడియో నిర్వహణలో తనదంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న జగన్‌ స్టూడియోస్‌  రెండు రాష్ట్రాల్లోని టీవీ, సినిమా మాధ్యమాలకు శిక్షణ పొందిన మంచి నటులను అందించాలన్న లక్ష్యంతో జగన్‌ స్టూడియోతో నిర్మించబడే అనేక సీరియల్‌ నిర్మాత, దర్శకులకు ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులను పరిచయం చేసి వారికి మంచి భవిష్యత్‌ కల్పించాలన్న ఆశయంతో ఆవిర్భవించిందే జగన్‌ స్టూడియోస్‌ టీవీ అండ్‌ ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌. ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 25, ఆదివారం జరిగింది. ఆంధ్ర ప్రజా నాట్యమండలి గౌరవ అధ్యక్షులు శ్రీ నల్లూరి వెంకటేశ్వరరావుగారి చేతులు మీదుగా ఈ స్టూడియో ప్రారంభమైంది. స్టూడియోలోని గ్రీన్‌ మ్యాట్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లను ప్రగతినగర్‌ ఎం.పి.టి.సి దయాకర్‌రెడ్డి, సర్పంచ్‌ సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాల రవి, సంజీవి, చాట్ల శ్రీరాములు, దీక్షిత్‌, స్టూడియో అధినేత జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....

Advertisement
CJ Advs

డా॥దాసరి నారాయణరావు(ఫోన్‌లో..) మాట్లాడుతూ ‘‘జగన్‌ ఎంతో ఉత్సాహంతో నిర్మించిన స్టూడియో ఎంతో అభివృద్ధి చెందింది. ఈ స్టూడియోలోనే టి.వి. అండ్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగించింది. ఇలాంటి ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా కొత్త ఆర్టిస్టులను తయారు చేస్తే ఇండస్ట్రీకి ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. ఏదో ఒక రోజు  నేను ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి అక్కడి స్టూడెంట్స్‌కి నటన పరంగా కొన్ని సలహాలు ఇచ్చేందుకు క్లాస్‌ తీసుకుంటాను. ఈ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభిస్తున్నందుకు జగన్‌ని అభినందిస్తున్నాను’’ అన్నారు. 

నల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘జగన్‌ స్థాపించిన ఈ స్టూడియో మధ్య తరగతి నిర్మాతలకు, దర్శకులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. అందరికీ అందుబాటుగా వుండడంతో ఎంతో అభివృద్ధి చెందింది. కళాకారులకు ఎంతో ఉపయోగకరంగా వుండే ఇన్‌స్టిట్యూట్‌ని కూడా ప్రారంభించినందుకు జగన్‌ని అభినందిస్తున్నాను’’ అన్నారు.

జగన్‌ మాట్లాడుతూ ‘‘పదేళ్ళ క్రితం ప్రగతి నగర్‌లో ఈ స్టూడియోను ప్రారంభించాను. ఎలాంటి సౌకర్యాలు లేని చోట స్టూడియో స్టార్ట్‌ చేస్తున్నానని అందరూ నవ్వారు. ప్రగతినగర్‌ సర్పంచి అయిన దయాకర్‌రెడ్డిగారు తప్పకుండా ఈ స్టూడియో సక్సెస్‌ అవుతుందని నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నేను దాదాపు 100 సినిమాల్లో ఒకటి, రెండు సీన్లలో నటించాను. కానీ, నేను ఎవరో ఎవరికీ తెలీదు. ఈ స్టూడియో ప్రారంభించిన తర్వాత మెల్ల మెల్లగా టి.వి. సీరియల్స్‌ షూటింగ్స్‌, సినిమా షూటింగ్స్‌ ఇక్కడ పెరిగాయి. చాలా సీరియల్స్‌ ఇక్కడే షూటింగ్‌ చేస్తున్నారు. రామోజీరావుగారు కూడా తమ సంస్థ తీసే సీరియల్స్‌ని ఇక్కడే షూటింగ్‌ చేస్తున్నారు. ఆవిధంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. కొన్ని సీరియల్స్‌ కోసం ఆర్టిస్టులు కావాలని నన్ను చాలా మంది అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వున్న ఆర్టిస్టుల కొరత తీర్చేందుకు ఈ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించాము. దాని ద్వారా కొత్త ఆర్టిస్టులను తయారు చేసి వారికి మంచి భవిష్యత్తు వుండేలా చూడాలన్నది మా ఆలోచన. దాని కోసం మాకు మంచి ఫ్యాకల్టీ కూడా వుంది. మల్లాది గోపాలకృష్ణగారు, జి.శేఖర్‌బాబుగారు, మైమ్‌ మధుగారు, రాము గారు ఇక్కడ స్టూడెంట్స్‌కి శిక్షణ ఇస్తారు. ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్‌ చేసిన ఈ ఇన్‌స్టిట్యూట్‌ అందరికీ ఉపయోగకరంగా వుంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. 

మాదాల రవి మాట్లాడుతూ  ‘‘కళ కాసుల కోసం కాదు, కళ చైతన్యం కోసం అన్నారు. మాదాల రంగారావుగారు, టి.కృష్ణగారు, వందేమాతరం శ్రీనివాస్‌గారు ఇలా ఎంతో మంది కళాకారులు ప్రజా నాట్య మండలి నుంచి వచ్చారు. జగన్‌గారు అందరికీ ఉపయోగంగా వుండేలా తమ స్టూడియోను చాలా తక్కువ రేట్లకు ఇస్తూ తన ఆశయానికి అనుగుణంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా కళాకారులను తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. వారి ప్రయత్నం విజయ వంతం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs