టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి ఎప్పుడు పోటీ ఉంటుంది. గత ఏడాది మెగా హీరోలకు బాగా కలిసొచ్చింది. కానీ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన బాలకృష్ణ 'లెజెండ్' మాత్రమే హిట్ అయింది. కాగా ఈ ఏడాది ఇప్పటికే పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల' తో బోణీ కొట్టాడు. దాంతో దాన్ని సమం చేసే భాద్యత నందమూరి మరో హీరో కళ్యాణ్ రామ్ పై పడింది. ఆయన నటించిన 'పటాస్' చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో నందమూరి అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఇక వచ్చే నెల అంటే ఫిబ్రవరి లో జూనియర్ ఎన్టీఆర్ 'టెంపర్' తో ఆ తర్వాత నెల మార్చిలో బాలయ్య 'లయన్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఈ ఏడాది మెగా హీరోలది పై చేయి అవుతుందా? లేక నందమూరి హీరోలది పై చేయి అవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది ...!