Advertisement
Google Ads BL

నాగార్జున పాత్రకు మార్పులు..!


త్వరలో టాలీవుడ్ సీనియర్ స్టార్ నాగార్జున, కోలీవుడ్ యంగ్ స్టార్ కార్తీలు హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుండగా, వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫ్రెంచ్ మూవీ 'ది ఇన్ టచ్ బుల్స్' ఆధారంగా రూపొందనుందని సమాచారం. ఈ చిత్రంలో నాగార్జున పాత్ర పక్షవాతంతో వీల్ చైర్  కే పరిమితమయ్యే పాత్ర అని, అలాగే అతనికి నర్సుగా ఆయన ఆరోగ్య బాగోగులను కార్తీ చూసుకుంటాడని సమాచారం. ఇక ఈ ఇద్దరు ఒకే అమ్మాయితో రొమాన్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ్ ను పక్షవాతం రోగిగా కాకుండా, అలాగే వీల్ చైర్ కు పరిమితమయ్యేలా చేయకుండా ఆ పాత్రకు కీలకమార్పులు చేస్తున్నారని  తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో పి. వి. పి. సంస్థ నిర్మించనుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs