Advertisement
Google Ads BL

'కత్తి' రూట్ లోనే 'సలీమ్'..!


విజయ్ఆంటోని ముఖ్యపాత్రలో తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని ప్రముఖ డబ్బింగ్ చిత్రాల నిర్మాత, ప్రతికాధిపతి సురేష్ కొండేటి తెలుగులో 'డాక్టర్ సలీమ్' పేరుతో డబ్బింగ్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఇటీవల చూసిన వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేసే విషయమై నిర్మాత సురేష్ కొండేటితో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా 'కత్తి' తరహాలో డబ్బింగ్ పనులు పూర్తయినప్పటికీ ఆపివేసే పరిస్థితులు ఉన్నాయని, ఇందు నిమిత్తం సురేష్ కొండేటి అడిగిన మొత్తం ఇవ్వడానికి సురేష్ బాబు అంగీకరించిన పక్షంలో ఈ చిత్రాన్ని వెంకటేష్ తో రీమేక్ చేయవచ్చుననే వార్త ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అయింది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs