'ఊహలు గుసగుసలాడే, జోరు' చిత్రాలతో ఆకట్టుకున్న స్వీటీ రాశిఖన్నా. ప్రస్తుతం గోపీచంద్, రవితేజల సరసన నటించే అవకాశాలను సంపాదించుకున్న ఈ అమ్మడు త్వరలో యంగ్ హీరో రామ్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం రామ్ 'పండగచేస్కో' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన శ్రీనివాసులురెడ్డి అనే నూతన దర్శకునితో ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నితిన్ తో చేయాలని భావించాడు. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే స్టొరీతో ఆయన రామ్ తో చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'శివం' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. మొత్తానికి ఈ నూతన దర్శకుడు రామ్ ను ఎలా చూపించనున్నాడో వేచిచూడాల్సివుంది..!