లిప్ కిస్ ల విషయంలో చాలా ఫాస్ట్ గా ఉండే అల్లుఅర్జున్ ఇకపై అలాంటి సీన్లలో నటించనని కొద్దిరోజుల క్రిందటే చెప్పాడు. బ్యాచ్ లర్ గా ఉన్నప్పుడు ఎన్ని తుంటరి పనులు చేసినా పర్వాలేదని, కానీ పెళ్లయిన తర్వాత ఇక భాద్యతగా ఉంటానంటూ ఇకపై లిప్ కిస్ లలో నటించనని తేల్చేసాడు. ప్రస్తుతం ఇదే బాటలో పయనిస్తోంది హీరోయిన్ హన్సిక. ఎందుకు అలా నటించవు? అంటే మాత్రం సిల్లీ రీజన్ చెబుతోంది. స్టోరీ డిమాండ్ చేసినా, దర్శక నిర్మాతలు పట్టుబట్టినా కూడా అలాంటి సీన్లలో నటించే పనిలేదని ఖరాకండిగా చెబుతోంది. ఇటీవల ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చిందట. అప్పటి నుండి ఇకపై లిప్ లాక్ సీన్స్ లో నటించకూదదని గట్టిగా నిర్ణయించుకుందట. లిప్ కిస్ ల వల్ల ఒకరి నుండి మరొకరికి బ్యాక్టీరియా వచే అవకాసం ఉండటం వల్ల తాను ముందుచూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం ఎలాంటి షరతులు లేవని అమ్మడు సెలవిస్తోంది.