Advertisement
Google Ads BL

'అనేకుడు'తో పరిక్షించుకోనున్న ధనుష్..!


గత కొన్నేళ్ళుగా తెలుగులో ఓ మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న హీరో, రజినీకాంత్ అల్లుడు ధనుష్ కు ఎట్టకేలకు తెలుగులో 'రఘువరన్ బి టెక్' రూపంలో ఓ మంచి హిట్ వచ్చింది. తమిళంలో 5 కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన ఈ చిత్రం 50 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ తెలుగులో 'రఘువరన్ బి టెక్' గా డబ్బింగ్ చేసి జనవరి 1వ తేదీన విడుదల చేసాడు. ఈ చిత్రానికి గాను నిర్మాత కోటిరూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఈ చిత్రం తెలుగులో మొత్తంగా 5 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలియచేస్తున్నాయి. మొత్తానికి ఏకంగా నిర్మాతకు 3 కోట్ల లాభాలను తెచ్చిపెట్టిన ధనుష్  ప్రస్తుతం తాను నటిస్తున్న తాజా చిత్రం 'అనేగన్'ను కూడా ఒకేసారి తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగులో 'అనేకుడు' గా రానున్న ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో ధనుష్ కు మరింత అదృష్టం కలిగిస్తుందో లేదో చూడాలి...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs