హాట్ హాట్ యాంకర్ అనసూయకు పెద్ద అవకాశమే లభించింది. కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'సోగ్గాడే చిన్ని నాయనా'లో మన్మధుడి మరదలి పాత్రలో నటించే చాన్స్ కొట్టేసింది. నాగార్జునతో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఒక సాంగులో బుల్లితెరకు పరిమితమైన తన హాట్ హాట్ అందాలను చూపిస్తుందట. ఆల్రెడీ సినిమా షూటింగ్‌లో పోల్గోందని సమాచారం. నాగార్జునతో అనసూయ కెమిస్ట్రీ అదుర్స్ అని టాక్.నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో హంసా నందిని ఐటెం సాంగుతో పాటు ఓ నాలుగు సన్నివేశాలలో కనిపిస్తుంది. ఈ మూవీతో కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.