Advertisement
Google Ads BL

గవర్నర్‌ టెలిఫోన్‌ను హ్యాక్‌ చేశారా..??


రెండు రాష్ట్రాలకు ప్రథమ పౌరుడిగా ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ నివసిస్తున్న రాజ్‌భవన్‌లో టెలిఫోన్‌ వ్యవస్థ హ్యాక్‌ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా రాజ్‌భవన్‌లోని టెలిఫోన్‌కు రూ. 5 లక్షల బిల్లు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజ్‌భవన్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌లోకి చొరబడిన దుండగులు అక్రమంగా విదేశాలకు భారీ ఎత్తున ఫోన్లు చేశారని, అందుకే ఒక నెలకే దాదాపు రూ. 5 లక్షల బిల్లు వచ్చిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఈ విషయమై అధికారులు కొంత విచారణ జరపగా ఈ టెలిఫోన్‌ నుంచి అధికంగా విదేశాలకే కాల్స్‌ వెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా ఒమన్‌, శ్రీలంక దేశాలకు ఈ టెలిఫోన్‌నుంచి కాల్స్‌ వెళ్లినట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ టెలిఫోన్‌ హ్యకింగ్‌కు సంబంధించి సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ టెలిఫోన్‌ హ్యాకింగ్‌ కేసుపై ఇప్పటికే సమీక్ష సమావేశం కూడా జరిపినట్లు తెలిసింది.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs