Advertisement
Google Ads BL

ఆశలన్నీ'బందిపోటు' మీదే..!


టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ కామెడీ స్టార్ గా ఎదిగిన హీరో అల్లరి నరేష్, ఒకప్పుడు గ్యారంటీ హీరోగా అందరి అభిమానాన్ని చూరగొన్న ఆయనకు ఈ మధ్య సరైన హిట్ లభించి చాలా కాలమే అయింది. 2012 లో వచ్చిన 'సుడిగాడు' తర్వాత  వరుసగా అరడజను ఫ్లాప్ లను మూటగట్టుకున్న అల్లరోడు తాజాగా క్లాసు డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'బందిపోటు' చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం పై ఆయన బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. అందునా తన తండ్రి ఇవివి సత్యనారయణ మరణం తర్వాత చాలా కాలం తర్వాత మరలా తమ సొంత బేనర్ ఈ.వి.వి సినిమా పతాకంపై తన సోదరుడు ఆర్యన్ రాజేష్ నిర్మాతగా నరేష్ ఈ సినిమా చేస్తున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఇంద్రగంటిని మాయ చేసి తన దారిలోకి తెచ్చుకున్నాడు. మొత్తానికి ఈ చిత్రం ఫస్ట్ లుక్స్ చూస్తుంటే ఈ చిత్రం అల్లరోడి కామెడీకి, ఇంద్రగంటి క్లాసు కామెడీని మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం ఇద్దరి అభిరుచులను టచ్ చేస్తూ సాగే చిత్రమని అర్ధమవుతోంది. పాటలు, ట్రైలర్ చూస్తుంటే ఈ విషయం స్పష్టం అవుతోంది. అదే సమయంలో తన డైరెక్షన్ కెరీర్ లోనే మొదటిసారి ఇంద్రగంటి ఇందులో ఓ ఐటంసాంగ్ ను పెట్టాడు. ఇక తనకు తోడుగా మరో కామెడీ హీరో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంపూర్నేష్ బాబు, క్లాసు కామెడీ చేసే అవసరాల శ్రీనివాస్ లను బాగా వాడుకున్నట్లు కనిపిస్తోంది. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ 'బందిపోటు' ప్రేక్షకుల హృదయాలను ఏ స్థాయిలో దోచుకుంటాడో వేచి చూడాలి...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs