Advertisement
Google Ads BL

అమీర్ ఓకే.. కరీనా నో..!


ప్రస్తుతం బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. త్వరలో ఏక్తాకపూర్ నిర్మాతగా భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవిత కధ ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో అజ్జూ రెండో భార్య సంగీతా బిజలానీ పాత్రను మొదట కరీనాకపూర్ చేత చేయించాలని భావించారు. మొదట్లో ఓకే చెప్పిన కరీనా చివరకు డేట్స్ అడ్జస్ట్ కావడంలేనందున ఆ పాత్రలో నటించలేనని తేల్చిందట. ఇక ఇటీవలే 'పీకే' చిత్రంలో ఓ వెరైటీ పాత్రకు ప్రాణం పోసిన మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ త్వరలో మరో వినూత్న పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఓ ప్రముఖ మల్లయోధురాలి (రెజ్లర్) జీవిత కధ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో ఆ మల్లయోధురాలి తండ్రిగా, తాను మల్లయోధుడిగా అమీర్ ఖాన్ నటించనున్నాడని సమాచారం. మొత్తానికి ఓ బయోపిక్ చిత్రానికి కరీనా నో చెబితే, మరో బయోపిక్ మూవీకి అమీర్ సై అన్నాడని బాలీవుడ్ సమాచారం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs