ఈ మధ్యకాలంలో టాలీవుడ్, కోలీవుడ్ లలో హార్రర్ కామెడీ చిత్రాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అయితే అలా వచ్చే చిత్రాలన్నీ హీరోయిన్ ఓరియెంటెడ్ గానో, లేక చిన్నచితకా ఆర్టిస్ట్ లతో రూపొందుతున్నాయి. దీంతో గోకుల్ అనే తమిళ డైరెక్టర్ మరింత డేర్ చేసి భారీ స్టార్ కాస్టింగ్ తో అలాంటి జోనర్ సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. త్వరలో నాగార్జున సరసన మరో హీరోగా మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్న తమిళ యంగ్ స్టార్ కార్తి ఆ చిత్రానికి ముందే తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సరికొత్త హార్రర్ కామెడీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి 'కాష్మోరా' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నాయన తార నటించనుండగా, మరో హీరోయిన్ గా తెలుగమ్మాయి శ్రీదివ్య నటించనుందని సమాచారం. మొత్తానికి ఇది శ్రీదివ్యకు మంచి చాన్స్ అనే చెప్పుకోవాలి. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.