Advertisement
Google Ads BL

'బీరువా' ఇన్ సైడ్ టాక్..!


ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బీరువా'. 'సంజుగాడి ఫ్రెండ్' అనేది ఉపశీర్షిక, సందీప్ కిషన్, సురభి జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 23 న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఫిల్మ్ నగర్ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ చిత్రం ఫస్టాఫ్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. సెకండాఫ్ మాత్రం ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా ఉందని సమాచారం. ఈ చిత్రానికి ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ నడుస్తోంది. జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్, కామెడియన్ సప్తగిరి ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ అని అంటున్నారు. ప్రస్తుతం ఫ్లాప్ ల్లో ఉన్న సందీప్ కిషన్ ఈ చిత్రం 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తరహాలో పెద్ద హిట్ ఇవ్వనుందని యూనిట్ సభ్యులు ఘంటాపథంగా చెబుతున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs