రెండువేల సంవత్సరాల క్రితం ఆదిశివుని స్వరూపమైన స్వామివారు తమిళనాడులో రామదేవర్‌గా జన్మించి తమిళనాడులోని 18 మంది సిద్దర్‌లలో రెండవ వాడుగా ప్రసిద్ధిగాంచారని వైదీశ్వరన్ కోయిల్‌లోని శివనాడి తాళపత్ర గ్రంథము మరియు బ్రహ్మంగారి కాలజ్ఞానంలోను స్వామివారి గురించి లిఖించబడియుంది. భూత, భవిష్యత్, వర్తమానాలు చెప్పడంలో స్వామివారు దిట్ట. ఇదే విషయాన్ని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లలో కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా భక్తులు ఎవరినైతే కొలుస్తారో ఆ రూపంలోనే కనువిందు చేస్తారు. త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో 200 ఎకరాలలో రామదేవర్ పీఠం పేరుతో ప్రముఖ ఆశ్రమంగా నిర్మాణం కాబోతుంది. జనవరి 15న వనస్థలిపురంలోని అభ్యుదయనగర్ కాలనీలో భక్తులందరూ కలిసి స్వామి వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆధ్వర్యంలో పంచహోమం, రామదేవరస్వామి హోమం, స్వామివారి పాదపూజ, రుద్రాభిషేకం, నమకజమకాలు మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారి శిష్యులైన ఇంద్రసేనారెడ్డి, బలవంతరెడ్డి, ఎస్.సురేష్‌రెడ్డి, శివరాజ్, చంద్రశేఖర్, వేములయ్య, శ్రీధర్, సభాపతి, శివ, శ్రీకాంత్, వాసు, కిషోర్, శివస్వామి, ఆనంద్, చెన్నయ్య, హోమానంద్, రేవంత్, ప్రసాద్, శర్మ, రషీద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
CJ Advs