సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగాయి. కాని అనుకున్న ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. 2014 సంక్రాంతి కానుకగా విడుదలయిన ఈ చిత్రం కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. అదే విధంగా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఐ' సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. విభిన్న చిత్రాలు తెరకెక్కించడం లో సిద్దహస్తుడైన శంకర్ 'ఐ' సినిమా ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజు మిశ్రమ ఫలితాలను మాత్రమే రాబట్టుకోగలిగింది. మరి ఈ పండగ అడ్వాంటేజ్ ని ఈ 'ఐ' ఎలా వినియోగించుకొని వీక్ టాక్ ను అధిగమించి కలెక్షన్ల పరంగా ఎలా ముందుకు దూసుకువెళ్తుందో వేచి చూడాలి..!