గణతంత్ర దినోత్సవాలకు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఇక ఈసారి పద్మ అవార్డులు అందుకేనే లిస్టులో తెలుగువారెందరు ఉన్నారనే విషయం కోసం రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పేరు ఈసారి కచ్చితంగా పద్మ అవార్డుల లిస్టులో ఉంటుందనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీలకు మద్దతుగా పవన్‌కల్యాణ్ ప్రచారం చేశారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం వెనుక పవన్‌కల్యాణ్ చేసిన కృషి మరవలేనిదని చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు మోడీ కూడా పవన్‌కల్యాణ్‌కు ఎనలేని మర్యాదనిస్తున్నాడు. అయితే ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో కూడా తాను మద్దతిచ్చిన పార్టీలే అధికారంలో ఉండటంతో అతనికి ఈసారి కచ్చితంగా 'పద్మభూషణ్' అవార్డు ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పవన్ పేరును సిఫార్సు చేస్తే.. కేంద్రం తప్పకుండా ఆమోదం తెలుపుతుందనే వాదనలు వినబడుతున్నాయి. ఏమో మరి మోడీ ఏంచేయనున్నారో మరో పది రోజుల్లో తెలుస్తుంది..!