బాలీవుడ్ అందాల నటి అలియాభట్ ఏ చిత్రంలో ఏ హీరో పక్కన చేస్తే అతడితో ఆమెకు ఎఫైర్ అంటగడుతున్నారు. తన రెండేళ్ళ కెరీర్ లో ఆమెపై నాలుగు ఎఫైర్స్ హాట్ హాట్ గా వినిపించాయి. తాజాగా ఆమె హీరో సిద్దార్ద్ మల్హోత్రా తో కలిసి ప్రేమాయణం నడుపుతోందని బాలీవుడ్ లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. వీరిద్దరూ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో ఒకేసారి వెండితెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం వీరి జోడీ లవర్స్ ఆఫ్ ది ఇయర్ అనే టైటిల్ కు సూటబుల్ అవుతుందని సెటైర్లు విపిస్తున్నాయి. ఇటీవల జరిగిన క్రిస్మస్ పార్టీతో పాటు న్యూఇయర్ వేడుకల్లో సైతం ఇద్దరూ సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ మీడియా కంటపడ్డారు. వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 20 ఏళ్లు నిండకుండానే ఆన్ ది స్క్రీన్ తో పాటు ఆఫ్ ది స్క్రీన్ కూడా సంచలనాలు నమోదు చేస్తున్న అలియాభట్, సిద్దార్ద్ ల జోడీ కత్రినా - రణ భీర్ ల జోడీని పక్కకు నెట్టి బాలీవుడ్ లో అందరి నోటిలో నానుతోంది.