టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును ఓవర్ నైట్ స్టార్ ను చేసిన చిత్రం 'ఒక్కడు' , గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఇంతకాలానికి హిందీలో 'తేవర్' పేరుతో రీమేక్ చేసారు. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ చిత్రంగా మిగిలిపోయింది. మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్న ఈ చిత్రానికి రెండో షో నుండే కలెక్షన్లు డ్రాపవుట్ అవ్వడం మొదలుపెట్టాయి. అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా రూపొందిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ ఐటెం సాంగ్ కూడా చేసింది. అయితే అవేమీ ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయాయి. కాగా ఈ చిత్రంపై విమర్శకులు భారీ ఎత్తున విమర్శలు పదునుపెడుతున్నారు. 'ఒక్కడు' చిత్రాన్ని రీమేక్ చేయడం చిత్ర దర్శకునికి చేతకాలేదని ఘాటుగా విమర్శిస్తున్నారు. అయితే చిత్రం నిర్మాతలు సంజయ్ కపూర్, బోనీ కపూర్ లు, దర్శకుడు అమిత్ శర్మ మాత్రం ఈ చిత్రం క్రమంగా పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం. దీన్ని విన్నవారు కాకి పిల్ల కాకికి ముద్దు.. అనే సామెతగా నిర్మాత, దర్శకుల మాటలు ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు.