మగరాయుడిలా అదరగొడుతున్న అనుష్క..!


సౌతిండియాలో తన సెక్సీ సొగసులతో అందరికీ అభిమాన తార అయింది. హాట్ హీరోయిన్ గా అనుష్క కేవలం తన అందచందాలతోనే కాదు... కరుకుగా మగరాయుడులా యాక్షన్ సీన్లు చేయడం కూడా ఆమె ప్రత్యేకత. తాజాగా ఆమె డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తున్న 'రుద్రమదేవి' లో ఆమె వీరనారి పాత్రను పోషిస్తోంది. సినిమాలో ఆమె కొన్ని సన్నివేశాల్లో పూర్తిగా మగరాయుడిలా పెర్ఫార్మెన్స్ అదరగొడుతోందని సమాచారం. కాకతీయ సామ్రాజ్యంలో ఓ యువతికి కిరీటం అప్పజెప్పినప్పుడు మగాడిగానే తనను పరిగణించి అప్పజెప్పినప్పుడు రుద్రమ దేవి అని కాదు.. రుద్ర దేవ అని ప్రస్తావించేవారు. 'రుద్రమదేవి' సారధ్యంలోని సైన్యం  శత్రురాజ్యంపై దండెత్తే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని అంటున్నారు. యుద్ధ సమయంలో ఆమె వేషం, శత్రుసైన్యంపై విరుచుకుపడే తీరు, ఆమె నడక, నడత, హావభావాలు.. ఇలా అన్నీ మగరాయుడిని తలపిస్తాయని అంటున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES