తమిళ స్టార్ ధనుష్ ఇప్పటికే తన తొలిచిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఆయన అమితాబ్ బచ్చన్ క్రేజ్ ను ఉపయోగించుకొని, బాలీవుడ్ లో మరింత ఇమేజ్ సంపాదించుకునే పనిలో పడ్డాడు. అనుకున్నట్లుగానే ఈ రజనీ అల్లుడి పాచిక బాగానే పారినట్లు కనిపిస్తోంది. అమితాబ్ బచ్చన్, ధనుష్ లతో పాటు కమలహాసన్ చిన్న కుమార్తె అక్షరహాసన్ లు ప్రధానపాత్రలు పోషిస్తున్న 'షమితాబ్' చిత్రానికి బాలీవుడ్ లో మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను రాబడుతోంది. బాల్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్, ధనుష్ లు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేల థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి
ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండగా , పి.సి.శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో అమితాబ్ స్వయంగా పాడిన పాట అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇక ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. అక్షర హాసన్ తాను నటించిన పాటలకు తానే కొరియోగ్రాఫర్ గా వ్యవహరించగా, అమితాబ్ తాగుబోతుగా విస్కీ గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు. మొత్తానికి అమితాబ్ బచ్చన్ సాయంతో ధనుష్ బాలీవుడ్ లో సెటిలవ్వాలని కోరుకుంటున్నాడు.