పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తమ ఊరిలో చూడాలని, కలవాలని ఆయన అభిమానులు ఎప్పుడూ కోరుకుంటూ వుంటారు. అయితే ఈసారి ఆ అదృష్టం నెల్లూరు పవన్ కళ్యాణ్ అభిమానులను వరించింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తన స్వస్థలం అయిన నెల్లూరులో జరిగే 'సంక్రాంతి సంబరాలు' కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా ఆహ్వానించారు. పవన్ ఈ ఫంక్షన్ కి వస్తున్నారని తెలియగానే..నెల్లూరు కళే మారిపోయింది. ఈ విషయం తెలిసిన ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నెల్లూరు చేరుకోవడం తో.. జన సంద్రం తో నెల్లూరు కళ కళ లాడిపోయింది. పవన్ కూడా తన అభిమానుల కోసం భారీ స్పీచ్ నే ఇచ్చారు. పవన్ తో పాటు ఈ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవ్వడంతో వెంకయ్య నాయుడు చాలా సంతోషాన్ని తెలియచేశారు.