Advertisement
Google Ads BL

సుదీర్ బాబు కోసం ముగ్గురు హీరోలు..!


కన్నడంలో చంద్రు దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన 'చార్మినార్' చిత్రాన్ని తెలుగులో రామలక్ష్మిసినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, లగడపాటి శిరీష రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో సుధీర్ బాబు, నందితలు జంటగా నటిస్తున్నారు. 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు చంద్రునే దర్శకత్వం  వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగ చైతన్య, రానాలు అతిధిపాత్రల్లో కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల కానున్న ఈ చిత్రం పై సుధీర్ బాబు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో వచ్చిన 'మరోచరిత్ర', హిందీలో వచ్చిన 'మైనే ప్యార్ కియా' చిత్రాలతో నిర్మాత లగడపాటి శ్రీధర్ పోలుస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొదట నాగ చైతన్యతో చేయాలనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. చివరకు ఇది సుధీర్ బాబు దగ్గరికి చేరింది. తాను హీరోగా నటించాల్సిన చిత్రంలో తానే ఓ గెస్ట్ రోల్ లో కనిపించనుండటం నాగ చైతన్యకు కొత్త అనుభవమనే చెప్పాలి.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs