బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన ఎలాంటి సంచలనాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. అయితే నరసాపురం ఎంపీ గంగరాజుకు కృష్ణా నది ఒడ్డున ఉన్న గెస్ట్‌హౌస్‌లో అమిత్‌షా బస చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల కృష్ణా నది తీరంలో పర్యటించిన ఏపీ మంత్రి దేవినేని ఉమ తీరానికి దగ్గరగా ఉన్న ఈ గెస్ట్‌హౌస్‌ను చూసి విస్మయం వ్యక్తం చేశారు. నిబంధనలు తుంగలో తొక్కుతో నిర్మించిన ఈ గెస్ట్‌హౌస్‌కు అనుమతులు ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఇంది ఎంపీ గంగరాజుకు, మంత్రి దేవినేనికి మధ్య విభేదాలకు దారి తీసింది. ఇదే సమయంలో అమిత్‌షా వచ్చి ఈ గెస్ట్‌హౌస్‌లో బస చేసేలా గంగరాజు వ్యూహం రచించారు. ఏకంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు బస చేసిన ఇంటిపై ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి దేవినేని సాహసిస్తారా అనేది అనుమానంగా మారింది. అంతేకాకుండా వివాదంలో ఉన్న ఈ ఇంట్లోనే అమిత్‌షా ఎందుకు బస చేశారన్నది కూడా తెలియకుండా ఉంది.