పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల బెంగుళూరులో ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్న ఆయనకు కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతోందని, దీనికి శాశ్వత నివారణకు గాను అయన శస్త్ర చికిత్స చేయించుకోవాలని డిసైడ్ అయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగానే ఆయన త్వరలో ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించుకోనున్నాడని తెలుస్తోంది. పవన్ మూడో భార్య అన్నా లెజినొవా స్వస్థలం కూడా ఆస్ట్రేలియా కావడంతో, ఆయన తన అత్తారింటికి మొదటిసారి వెళ్లి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటాడని సమాచారం. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది ... !