Advertisement
Google Ads BL

'టెంపర్' ది 'గోపాల గోపాల' కి వాడారంట!


పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు కలిసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం ఆడియో ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం లో ప్రత్యేకమైన డ్యుయట్స్ అంటూ ఏమీ లేవు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు, ఒక డిఫరెంట్ చిత్రం. దీంతో రొటీన్ కు బిన్నంగా ఈ చిత్రంలోని పాటలు ఉన్నాయి. మొత్తం మూడు పాటలున్న ఈ ఆల్బమ్ లో సిట్యుయేషన్లకు తగ్గట్లు పాటలు ఉన్నాయి. 'భజే భజే'.. పాట అల్ రెడీ వారం ముందే మోషన్ పిక్చర్  తో పాటు విడుదలైంది. ఇది ఓ వేడుకకు చెందిన సిట్యుయేషన్ సాంగ్.మంచి టెంపో తో ఎనర్జిటిక్ గా ఉంది. ఇక 'ఎందుకో.. ఎందుకో..' పాట ఈ అల్బమ్ లో బెస్ట్ సాంగ్ కింద చెప్పుకోవచ్చు.ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కైలాష్ కేర్ ఈ పాటను పాడాడు. ఇక మూడో పాట 'నీదే.. నీదే...' బాధను వర్ణిస్తూ సాగే ఒక టిపికల్ ఫీల్ గుడ్ సాంగ్. మొత్తం గా కేవలం మూడే పాటలు ఉన్నప్పటికీ ఈ చిత్రంలోని పాటలు సినిమాకు బాగా ప్లస్ అవుతాయని, అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకు హైలెట్ అవుతుందని భావించవచ్చు. కాగా ఈ చిత్రంలోని 'భజే.. భజే..' పాటపై ఓ ఇంట్రస్త్రింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ ట్యూన్ ను వాస్తవానికి  అనూప్ రూబెన్స్ 'టెంపర్' చిత్రం కోసం తయారు చేసాడట. కానీ ఆ చిత్రంలోని సిట్యుయేషన్ కు ఈ ట్యూన్ సరిపోదని పూరీ జగన్నాద్ చెప్పడం తో ఆ ట్యూన్ కు కొన్ని మార్పులు చేర్పులు చేసి... కొత్త గా భక్తి భావాన్ని పెంచే విధంగా మార్పు చేసి 'గోపాల గోపాల' కు సింక్ అయ్యేలా అనూప్ ఈ చిత్రానికి వాడుకున్నాడు అని తెలుస్తుంది. మొత్తానికి  ఇదే ట్యూన్ ఆల్బమ్ మొత్తం మీద మంచి ఊపునిస్తున్న ట్యూన్ అవ్వడం విశేషం.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs