Advertisement
Google Ads BL

'గోపాల గోపాల, ఐ' తరువాత వచ్చే మూవీ ఇదే..!


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'పటాస్'. వాస్తవానికి డిసెంబర్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. కాగా ఈ చిత్రం ద్వారా రచయిత అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం టీజర్లకు, ఆడియోకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత బేనర్ అయిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతాన్ని అందించగా పంజాబీ భామ శ్రుతిశోది హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్, యాక్షన్, మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ 'పటాస్' చిత్రాన్ని జనవరి 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి సందడితోపాటు పెద్ద చిత్రాలైన 'గోపాల గోపాల, ఐ' చిత్రాల హడావుడి ముగిసిన తరువాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.తన కెరీర్ లో 'అతనొక్కడే' తప్ప మరో హిట్ ఎరుగని కళ్యాణ్ రామ్ ఈ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. మరి ఈ చిత్రం అతనికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచి చూడాల్సివుంది...!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs