కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవితకు స్వైన్‌ఫ్లూ సోకిందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలోని పలు జిల్లాల్లో పలువురు స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. అయితే ఏకంగా సీఎం కుమార్తెకే ఈ వ్యాధి సోకిందన్న వార్తలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. మూడు రోజుల క్రితం చలి జ్వరంతో బాధపడుతూ కవిత యశోద ఆస్పత్రిలో చేరారు. మొదట సాధారణ జ్వరమని భావించిన వైద్యులు పరీక్షలు జరపగా స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించినట్లు సమాచారం. ఈ మేరకు ఎంపీ కవితకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని కూడా ప్రచురించింది. అయితే అధికారులు మాత్రం స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తుల జాబితాలో కవిత పేరు చేర్చలేదు. మరోవైపు కవితకు స్వైన్‌ఫ్లూ సోకిందన్న వార్తలతో టీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.