నందమూరి ఫ్యామిలీ నుండి తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ లో కొనసాగుతోంది ఇద్దరే ఇద్దరు. ఒకరు నటసింహం బాలకృష్ణ.. రెండోది యంగ్ టైగర్ ఎన్టీఅర్. ఇద్దరి సినిమాలకు సంబందించిన ఫస్ట్ లుక్స్, టీజర్స్ ఇటీవల విడుదలయ్యాయి. వాస్తవంగా పోటాపోటీగా విడుదలయ్యాయనే చెప్పాలి. యూ ట్యూబ్ లో ఈ రెండింటి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోందని మీడియా లో వార్తలు సైతం వచ్చాయి. అయితే అందరూ ఈ పోటీలో యంగ్ టైగర్ ఎన్టీఅర్ ముందంజలో ఉంటాడని ఊహించారు. కాగా బాలకృష్ణ నటించిన 'ఎన్.బి.కె.లయన్' టీజర్ కు 3.30 లక్షల పై చిలుకు హిట్స్ వస్తే... జూనియర్ ఎన్టీఅర్ 'టెంపర్' కేవలం 2లక్షల పైచిలుకు హిట్స్ మాత్రమే రావడం.. ఇందులో బాబాయ్ దే అగ్రస్తానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యం కు లోను చేస్తుంది. దీంతో ఇప్పటికీ సరైన హిట్ పడితే నటసింహన్ని ఆపడం ఎవ్వరి వల్లా కాదని బాలయ్య అభిమానులు ఆనందపడుతున్నారు.